పౌరసత్వ సవరణ చట్టం (CAA) డిసెంబర్ నెలలో పార్లమెంట్లో ఆమోదం పొందడంతో దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. CAA తో పాటు, జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టికకి (NRC) కూడా వ్యతిరేకత మొదలు అయింది. ఒక వైపు నిరసనలు జరుగుతుండగానే, NPR అమలు కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 4000 కోట్లు మంజూరు చేసింది.
ఇవాల్టి ఎపిసోడ్ లో శ్రీనివాస్ కొడాలి మనతో, NPR గురించి, NPR ఉనికి లో కి రావడానికి గల చారిత్రిక కారణాల గురించి, అమలు లో జరిగిన లోటుపాట్లు, ఇంకా NPR వల్ల పొంచి ఉన్న privacy risks గురించి మాట్లాడతారు.
ప్రభుత్వ పాలన, internet, మరియు data కి సంబంధించిన అంశాలలో శ్రీనివాస్ పరిశోధన చేస్తారు.