ప్రముఖ వ్యవసాయ నిపుణులు శ్రీ రామాంజనేయులు గారితో సునో ఇండియా ఎడిటర్ పద్మప్రియ ఇంటర్వూ లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అమలు అవుతున్న లాక్డౌన్ కర్ఫ్యూ నేపథ్యం లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతారు.
లొక్డౌను నేపథ్యం లో రైతులు తమ తమ పంటలు ,కూరగాయలు వంటి వాటిని వినియోగదారుల కు చేర్చే క్రమం లో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు ,వారికి ఇవ్వాల్సిన లేదా ఇస్తున్నామని చెబుతున్న వెసులుబాటు చర్యల ఆదేశాలను అధికారులు క్రింది స్థాయి అధికారుల కి చేరి సరిగా అమలుపరిచెలా చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వినియోగదారుల కోణం లోనే కాకుండా రైతుల కోణం లోంచి చూసి సరైన వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. రానున్న మూడు వారాలు కీలకం వ్యవసాయ పరంగా.అదీగాక వ్యవసాయం కూడా అత్యవసరసేవల క్రిందకు వస్తుంది.
In the wake of the lockdown, farmers are facing challenges delivering their crops, vegetables to the consumers. Moreover, the government should look at the welfare programs introduced by the government from the perspective of the consumer and not the farmers, and take appropriate action. The next three weeks will be crucial in terms of agriculture says Mr Ramanjaneyulu.)