Right to information act సులువుగా చెప్పాలంటే RTI గా పిలవబడే సమాచార హక్కు చట్టం ప్రజలకు పార్లమెంట్ సాక్షి గా సిద్ధించిన గొప్ప చట్టం.ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ను పెంచటం.
చట్టాల అమలులో పారదర్శకత accountability అవినీతిని అరికట్టడం ప్రజాస్వామ్యం ప్రజల కోసమే పనిచేసేలా చూడటానికి తగిన విధంగా ప్రజలను అప్రమత్తం గా ఉండేలా చెయ్యటమే చట్టం ఉద్దేశ్యం.
2005 లో పార్లమెంట్ లో ఆమోదం పొంది రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 (1)(a) ప్రకారం RTI చట్టం ప్రాథమిక హక్కు దేశ ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా తనకు కావలసిన సమాచారాన్ని అడిగి పొందే అవకాశం హక్కుని కలిగించింది ఈ చట్టం.
గత 16 సంవత్సరాలుగా ఉనికిని చాటుతూ ప్రజలకు వజ్రాయుధం గా ఉన్న RTI చట్టం కాలక్రమేణా బలహీనం పడుతున్నది అనే ఆందోళన ఉన్నది ప్రజల్లో. ప్రభుత్వాలు పాలకులు ఎవరైనా తమని ప్రశ్నించటం వారికి నచ్చదు.సమాచారం కోసం వచ్చిన దరఖస్తుదారులకు సమాధానం సకాలంలో దొరక్కపోవచ్చు. ఇలాంటి నేపథ్యం లో తెలంగాణలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం ఉన్నత అధికారుల అనుమతి తో RTI applications కి Reply ఇవ్వాలనే నిబంధన RTI అమలు లో ఆందోళన కలిగిస్తోంది అని న్యాయ నిపుణుల అభిప్రాయం రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కు RTI చట్టం కి ఆటంకం అనొచ్చా? చట్టం లో అలాంటి ప్రస్తావన ఉందా?సర్క్యులర్ న్యాయపరంగా ఉందా?
ఇలాంటి అనేక సందేహాలకు సమాధానం సమాచారం సమీక్ష లో Factly founder. RTI activist Rakesh Dubbudu గారి interview లో తెలుసుకుందాము.