అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన వర్షం, వరదల కారణంగా ఎన్నో కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు రావడం, ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కున్న సామాన్లు, వాహనాలు నాశనం అవ్వడం జరిగింది. దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంతటి వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఈ వరదలకు వర్షం మాత్రమే కారణం కాదు. ఈ సందర్భంగా నగరంలో అవసరమైన మేరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు లేకపోవడం, చెరువులలో ఆక్రమణల వంటి సమస్యల గురించిన చర్చ మరోసారి ప్రారంభమైంది.
ఈ అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్లో అయిషా మిన్హాజ్, ICLEI డిప్యూటీ డైరెక్టర్ సౌమ్య చతుర్వేదుల గారితో మాట్లాడారు.