తప్పెట్లు తాళాలు పందిళ్ళు పసందైన వివాహ భోజనము తిని వంటకాల రుచులు ఆస్వాదించి మెచ్చుకుని కేటరింగ్ వారి విజిటింగ్ కార్డ్ జేబులో పెట్టుకొని వచ్చిన రోజులు గుర్తున్నాయా? ఆ జ్ఞాపకాలు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం అంచులో ఉండి అల్లాడుతున్న కేటరింగ్ రంగం.
COVID ఆర్థికంగా ఎందరినో ఎన్నో సంస్థల్ని వ్యాపారాలను కోలుకోలేని దెబ్బతీసింది. వాటిలో అన్నపూర్ణ కి మారుపేరైన కేటరింగ్ రంగం ఎదుర్కుంటున్న ఇబ్బందులు కష్టనష్టాలను ప్రముఖ కేటరింగ్ తిరుమల caterers యజమాని శ్రీనివాస్ గారు డి.చాముండేశ్వరి తో వివరంగా చెప్పారు.